యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర పార్ట్ – 1 సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ క్యారెక్టర్ చేశాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, పాటలు అభిమానులను బాగా అలరించాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ యూకే లో ప్రారంభం అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ప్రీమియర్ షొలకి సెన్సేషన్ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటి వరకూ 10 వేలకి పైగా టికెట్లు కేవలం సినీ వోల్డ్ లోనే అమ్ముడు పోయాయి. ఇదే విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అజయ్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.