మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “దేవర” కోసం ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాకుండా పాన్ ఇండియా వైడ్ ఆడియెన్స్ కూడా ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ శరవేగంగా ఇండియా వైడ్ జరుగుతూ వెళ్తున్నాయి. మరి అన్ని భాషల్లో కూడా ఫుల్ స్వింగ్ లో ఆఫ్ లైన్ ఆన్లైన్ ప్రమోషన్స్ కూడా జరుగుతుండగా ఒక వినూత్న అటెంప్ట్ అయితే వైరల్ గా మారింది.
ముంబై లోని దాదర్ చౌపట్టి సముద్ర ప్రాంతం దగ్గర ఎన్టీఆర్ తాలూకా కటౌట్ ని సముద్రంలో తేలియాడేలా నిలిపారు. దీనితో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మొత్తానికి అయితే ఇలా దేవరపై క్రేజీ ప్రమోషన్స్ ని మేకర్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది అలాగే సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించాడు. అలాగే ఈ ఇద్దరూ ఈ సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నారు.
Installed a #Devara cutout on the sea at Dadar Chowpatty in Mumbai ❤️
Spot it during Ganesh Visarjan and capture the moment! pic.twitter.com/JPMfKh6eYM
— Devara (@DevaraMovie) September 14, 2024