“దేవర” థర్డ్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన అనిరుధ్!

“దేవర” థర్డ్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన అనిరుధ్!

Published on Sep 1, 2024 10:19 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర చిత్రం సెప్టెంబర్ 27 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. జనతా గ్యారేజ్ తరువాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం నుండి థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న అనిరుధ్ రవి చందర్ తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు. దావుడి పేరుతో మూడో సాంగ్ ఉండనుంది. ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ లు ఈ పాటలో బాగా ఆకట్టుకున్నట్లు తెలిపాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు