Devara: ‘దేవర’ రికార్డులకు హద్దే లేదుగా..!

Devara: ‘దేవర’ రికార్డులకు హద్దే లేదుగా..!

Published on Sep 24, 2024 2:01 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి యాక్షన్ డ్రామా మూవీగా ‘దేవర’ రానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఈ మూవీపై హైప్‌ని పీక్స్‌కి చేర్చాయి. కాగా, ఈ సినిమా కోసం ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు.

‘దేవర’ మూవీ రిలీజ్‌కి ముందే రికార్డులను క్రియేట్ చేస్తూ సత్తా చాటుతోంది. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేస్తూ ఔరా అనిపిస్తోంది. ఈ సినిమా ప్రీ-సేల్స్ రూపంలో ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే 1.75 మిలియన్ డాలర్స్ ప్రీ-సేల్స్ రూపంలో కలెక్ట్ చేసిన ‘దేవర’, ఒక్క సినీమార్క్ థియేటర్ చైన్‌లోనే 1 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టడం విశేషం.

ఇలా రిలీజ్‌కి ముందే ‘దేవర’ రికార్డులకు హద్దు లేకుండా పోతుందని అభిమానులు అంటున్నారు. ఇక సినిమా రిలీజ్ తరువాత ఈ రికార్డులు ఏ స్థాయికి చేరుతాయో ఊహించలేకపోతున్నాం అని వారు చెబుతున్నారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘దేవర’ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు