బ‌జ్.. దేవ‌ర నెక్ట్స్ షెడ్యూల్ అక్క‌డేనా..?

బ‌జ్.. దేవ‌ర నెక్ట్స్ షెడ్యూల్ అక్క‌డేనా..?

Published on Jun 15, 2024 9:01 PM IST

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘దేవ‌ర’ ఇప్పటికే షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ద‌ర్శకుడు కొర‌టాల శివ డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అంద‌రూ ఆస‌క్తిగా చూస్తున్నారు.

కాగా, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రీసెంట్ గా గోవాలో జ‌రిగింది. అక్క‌డి షెడ్యూల్ ను ముగించుకుని ఎన్టీఆర్ హైద‌రాబాద్ కూడా వ‌చ్చాడు. అయితే, ఇప్పుడు ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ థాయిలాండ్ లో జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది.

ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం ‘దేవ‌ర’ మూవీ టీమ్ త్వ‌ర‌లోనే థాయిలాండ్ వెళ్ల‌నుంద‌ట. ఎన్టీఆర్, జాన్వీ క‌పూర్ ల‌పై ఈ రొమాంటిక్ సాంగ్ షూట్ చేయ‌నున్నారు. అయితే, దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అప్డేట్ రావాల్సి ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అనిరుధ్ రవిచంద‌ర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 27న గ్రాండ్ రిలీజ్ చేయ‌నున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు