విడుదలకు ముందు ‘దేవర’కి వేడుక లేనట్టే !

గత రాత్రి జరగాల్సిన ‘దేవర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్’.. రద్దీ, తొక్కిసలాట మరియు భద్రతా కారణాల కారణంగా రద్దు చేయబడింది. రద్దు చేసినందుకు క్షమాపణలు చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ తమ వీడియో సందేశాలను కూడా పోస్ట్ చేశారు. ఏది ఏమైనా ‘దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్’ రద్దు అవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఐతే, మళ్లీ ఫ్యాన్స్ కోసం ఏదైనా వేడుకను దేవర టీమ్ నిర్వహిస్తుందా ? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఇప్పుడున్న అప్ డేట్ ప్రకారం దేవర టీమ్.. సినిమా విడుదలకు ముందు ఇక ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించే ఆలోచనలో లేదు. ‘కల్కి 2898 AD’ టీమ్ చేసినట్లే, సినిమా రిలీజ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి పాన్‌ ఇండియా రేంజ్‌ లో ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తోందో చూడాలి.

Exit mobile version