Devara: ‘దేవర’ టికెట్ బుకింగ్స్ షురూ..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘దేవర’ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిన్న గ్రాండ్‌గా నిర్వహించాలని చూసిన చిత్ర యూనిట్, కొన్ని భద్రతా కారణాల వల్ల ఈవెంట్‌ని రద్దు చేసుకుంది. దీంతో వారు అభిమానులకు తమ క్షమాపణలు కూడా తెలిపారు. అయితే, ఈ సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, ‘దేవర’ చిత్ర టికెట్ బుకింగ్స్ తాజాగా అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం నుండి టికెట్ ధరల పెంపుకి గ్రీన్ సిగ్నల్ రావడంతో, హైదరాబాద్ సిటీకి సంబంధించిన టికెట్ బుకింగ్స్‌ను తాజాగా రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమాను తొలిరోజే చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

ఇక ‘దేవర’ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Exit mobile version