Devara: దేవర ప్రీ-రిలీజ్ ఈవేంట్ జరిగేది ఇక్కడే!

Devara: దేవర ప్రీ-రిలీజ్ ఈవేంట్ జరిగేది ఇక్కడే!

Published on Sep 21, 2024 12:59 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ మరో వారం రోజుల్లో రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ డ్రామా మూవీగా ఇది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సెప్టెంబర్ 22న ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన చిత్ర యూనిట్.. ఇప్పుడు ఈ ఈవెంట్‌కి సంబంధించిన ప్లేస్‌ని ఫిక్స్ చేశారు. దేవర చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని నోవోటెల్‌లో సెప్టెంబర్ 22న సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుందని మేకర్స్ వెల్లడించారు.

ఎన్టీఆర్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు