ఆస్ట్రేలియాలో దేవర ఊచకోత.. రెండే నిమిషాల్లో ముగిసింది!

ఆస్ట్రేలియాలో దేవర ఊచకోత.. రెండే నిమిషాల్లో ముగిసింది!

Published on Sep 14, 2024 12:05 AM IST

‘దేవర’ తన ఊచకోతను మొదలుపెట్టాడు. రిలీజ్‌కి ముందే తన సత్తా చాటుతూ విధ్వంసం సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా ఓవర్సీస్‌లో దేవర మేనియాతో బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ఇప్పటికే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మిలియన్ మార్క్‌ను దాటిన ‘దేవర’ వసూళ్లపర్వం ఇప్పుడు మిగతా దేశాల్లోనూ మొదలైంది.

ఆస్ట్రేలియాలోనూ దేవర ర్యాంపేజ్ చూపిస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్క్రీన్ కలిగిన మెల్‌బోర్న్ ఐమ్యాక్స్‌లో దేవర ప్రీమియర్‌కి సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లో కేవలం రెండే నిమిషాల్లో అయిపోయాయి. ఇది దేవర క్రేజ్ ఎంతలా ఉందో నిరూపిస్తుందని ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.

ఇక దేవర ఊచకోత అని మేకర్స్ తెలిపారు. ఎన్టీఆర్ రెండు పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేయగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు