అమెరికా టు ఆస్ట్రేలియా.. తగ్గని ‘దేవర’ ర్యాంపేజ్!

అమెరికా టు ఆస్ట్రేలియా.. తగ్గని ‘దేవర’ ర్యాంపేజ్!

Published on Sep 14, 2024 11:00 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘దేవర’ మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇక రిలీజ్‌కి ముందే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ముఖ్యంగా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రిలీజ్‌కు ముందే ప్రీ-సేల్స్‌తో దుమ్ములేపుతోంది. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఇప్పటికే మిలియన్ డాలర్ మార్క్‌తో దూసుకెళ్తోంది. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ దేవర మాస్ ర్యాంపేజ్ చూపిస్తోంది. ఈ సినిమా ప్రీ-సేల్స్‌లో అక్కడ ఇప్పటికే 100K ఆస్ట్రేలియన్ డాలర్స్ క్రాస్ చేసింది.

ఇక ఈ సంఖ్య ఎంతవరకు వెళ్తుందో అని అక్కడి సినీ ఎక్స్‌పర్ట్స్ అంచనాలు వేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు