దసరాకి “దేవర” ర్యాంపేజ్..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే సోలోగా బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే రిలీజ్ రోజే కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడింది.

అలా మూడు వారాల రన్ కి వచ్చిన ఈ చిత్రం మూడో వారాంతం అందులోని దసరా నాడు తెలుగు రాష్ట్రాల్లో అదరగొడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని మాస్ ఏరియాల్లో అయితే దేవర హౌస్ ఫుల్స్ పెడుతుందట. ఇలా దసరా నాడు దేవర మాస్ ర్యాంపేజ్ ఏంటో చూపించాడు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించారు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు.

Exit mobile version