యూఎస్ ప్రీమియర్స్ ప్రీసేల్స్‌లో ‘దేవర’ ర్యాంపేజ్ షురూ!

యూఎస్ ప్రీమియర్స్ ప్రీసేల్స్‌లో ‘దేవర’ ర్యాంపేజ్ షురూ!

Published on Sep 6, 2024 10:03 PM IST

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’ సెప్టెంబర్ 27న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. ఈ సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇక ఈ సినిమా కోసం ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ స్పెషల్ ప్రీమియర్స్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రీమియర్స్ కోసం టికెట్ ప్రీ-సేల్స్ కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ ర్యాంపేజ్ చూపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా 500K డాలర్ల ప్రీ-సేల్స్ వసూళ్లు రాబట్టింది.

దీంతో ఈ సినిమా రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న దేవర సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు