Devara: ఏపీలో ‘దేవర’ మాస్ ర్యాంపేజ్!

Devara: ఏపీలో ‘దేవర’ మాస్ ర్యాంపేజ్!

Published on Sep 26, 2024 11:13 PM IST


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘దేవర’ విధ్వంసానికి సిద్ధమయ్యింది. ఈ సినిమాతో అభిమానుల ఆరేళ్ల ఆకలి తీరనుంది. ఇక తమ అభిమాన హీరోను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ యుఫోరియా పీక్స్‌కి చేరుకుంది.

ఇక ఈ సినిమాను తొలి రోజే చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ బుకింగ్స్ ఊహకందని విధంగా దూసుకెళ్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మిడ్‌నైట్ షోలకు అనుమతులు దొరకడంతో రాత్రి 1 గంటకే దేవరోడి సత్తా చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో మిడ్‌నైట్ 1 గంట షోల సంఖ్య చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఏకంగా 528కి పైగా మిడ్‌నైట్ 1 గంట షోలు పడుతున్నాయంటే, ‘దేవర’ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమాతో తమ అభిమాన హీరో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తాడని ఎన్టీఆర్ అభిమానులు పూర్తి కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ పూర్తి మాస్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దాడు. మరి దేవరోడి విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు