“దేవర” డే 1 తెలుగు రాష్ట్రాల వసూళ్ల డీటెయిల్స్ ఇవే.!

యంగ్ టైగర్ ని మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మార్చిన లేటెస్ట్ భారీ చిత్రమే “దేవర”. తన కెరీర్ 30వ సినిమాగా దర్శకుడు కొరటాల శివతో తారక్ చేసిన రెండో సినిమా ఇది కాగా భారీ హైప్ నడుమ ఎట్టకేలకి థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చింది. అయితే ఈ చిత్రం అనుకున్నట్టుగానే రికార్డు ఓపెనింగ్స్ ని అయితే సాధించింది అని చెప్పాలి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో దేవర సంచలన డే 1 వసూళ్లు నమోదు చేసింది.

మన తెలుగులో పలు బిగ్గెస్ట్ హిట్స్ అయినటువంటి RRR, సలార్ లతో పాటుగా ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ ని దేవర చాలా ప్రాంతంలో కొట్టి ఎన్టీఆర్ మాస్ పవర్ అంటే ఏంటో చూపించింది అని చెప్పాలి. ఇలా ఆల్రెడీ నైజాం మార్కెట్ లో ఆల్ టైం టాప్ 2లో దేవర నిలవగా ఇపుడు తెలుగు రాష్ట్రాల టోటల్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి. మరి ఇలా పి ఆర్ నంబర్స్ ప్రకారం దేవర డే 1 ని ప్రాంతాల వారీగా చూసినట్టు అయితే..

నైజాం: 19.32 కోట్లు
వైజాగ్: 5.47 కోట్లు
గుంటూరు: 6.27 కోట్లు
నెల్లూరు: 2.11 కోట్లు
కృష్ణ: 3.02 కోట్లు
తూర్పు గోదావరి: 4.02 కోట్లు
పశ్చిమ గోదావరి: 3.60 కోట్లు
సీడెడ్: 10.40 కోట్లు

ఇలా మొత్తం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే దేవర మొదటి రోజు మొత్తం బెనిఫిట్ షోస్ తో కలిపి 54.21 కోట్ల షేర్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో కేవలం ఒక్క రోజులోనే తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల షేర్ అందుకున్న మరో హీరోగా తారక్ భారీ రికార్డు సెట్ చేసాడు. మొత్తానికి అయితే దేవర మ్యానియా మామూలు లెవెల్లో లేదనే చెప్పాలి.

Exit mobile version