‘దేవర’ ట్రైలర్ కి రిలీజ్ టైమ్ ఫిక్స్

‘దేవర’ ట్రైలర్ కి రిలీజ్ టైమ్ ఫిక్స్

Published on Sep 9, 2024 3:00 PM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక సెప్టెంబర్ 10న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే టీం వెల్లడించింది. ఐతే, రేపు సాయంత్రం 05:04 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుందని మేకర్స్ తాజాగా అప్‌ డేట్ ఇచ్చింది. శక్తివంతమైన ట్రైలర్ విడుదల పోస్టర్‌ ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి పాన్‌ ఇండియా రేంజ్‌ లో ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు