‘దేవర రిలీజ్ ట్రైలర్’ పై లేటెస్ట్ అప్ డేట్

‘దేవర రిలీజ్ ట్రైలర్’ పై లేటెస్ట్ అప్ డేట్

Published on Sep 22, 2024 11:04 AM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘దేవర రిలీజ్ ట్రైలర్’ ను కూడా ఈ రోజు ఉదయం 11:07AM కి రిలీజ్ చేయాల్సి ఉంది. ఐతే, ‘దేవర రిలీజ్ ట్రైలర్’ 11:07AM కి రిలీజ్ కావడం లేదని, ట్రైలర్ విడుదల ఆలస్యం కానుందని, త్వరలో రిలీజ్ టైమ్ గురించి మీకు తెలియజేస్తాము అంటూ మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

కాగా ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి పాన్‌ ఇండియా రేంజ్‌ లో ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు