ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం దేవర అనే చెప్పాలి. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ నేడు రిలీజ్ ట్రైలర్ ని వదులుతున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ ట్రైలర్ మాత్రం అదిరే లెవెల్లో ఉందని చెప్పాలి.
మొదటి ట్రైలర్ కంటే చాలా బెటర్ గా మరింత ఎంజాయ్ చేసే విధమైన మ్యూజిక్ కట్స్ తో ఫుల్ ప్యాకేజీలా ఉందని చెప్పొచ్చు. ఎర్ర సముద్రంపై డైలాగ్ తో గూస్ బంప్స్ తెప్పించే విధంగా మొదలై ఒక సెలబ్రేషన్ లా ట్రైలర్ ని ఎండ్ చేసి అదరగొట్టారు. అలాగే మధ్యలో మళ్ళీ షార్క్ సీక్వెన్స్ లు మైండ్ బ్లాకింగ్ అని చెప్పొచ్చు. చాలా నాచురల్ వి ఎఫ్ ఎక్స్ ఈ సీక్వెన్స్ లో కనిపించడం విశేషం.
అలాగే అనిరుద్ స్కోర్ లో షేడ్స్ ని కూడా మనం ఇందులో గమనించవచ్చు. ఇంకా కొరటాల డైలాగ్స్ కూడా మంచి పవర్ఫుల్ గా పేలాయి. మరి దేవర ఎలాంటి సెన్సేషన్ ని థియేటర్స్ లో సెట్ చేస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రంని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.