నార్త్ మార్కెట్ లో “దేవర” దూకుడు..

నార్త్ మార్కెట్ లో “దేవర” దూకుడు..

Published on Sep 29, 2024 11:00 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరో భారీ అంచనాలు నడుమ వచ్చిన చిత్రం సెన్సేషనల్ వసూళ్లు ఈ రెండు రోజుల్లో నమోదు చేసింది. అలాగే ఈ చిత్రం తెలుగు స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రం అదరగొట్టగా నార్త్ మార్కెట్ లో ఈ చిత్రం రోజు మించి రోజు సాలిడ్ వసూళ్లు నమోదు చేసింది.

అలా ఇప్పుడు నార్త్ మార్కెట్ లో దేవర దూకుడు ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తుంది. నార్త్ లో మేజర్ ప్రాంతాల్లో దేవర సాలిడ్ బుకింగ్స్ ని నమోదు చేస్తుంది. దీనితో హిందీ మార్కెట్ లో మాత్రం దేవర నిలకడగా దూసుకెళ్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. అలాగే ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు