మెలోడి ట్యూన్ తో రాబోతున్న ‘దేవ‌ర’ సెకండ్ సాంగ్

మెలోడి ట్యూన్ తో రాబోతున్న ‘దేవ‌ర’ సెకండ్ సాంగ్

Published on Aug 3, 2024 5:29 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ న‌టిస్తున్న లేటెస్ట్ సెన్సేష‌నల్ మూవీ ‘దేవ‌ర’ కోసం అభిమానులు ఎంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండ‌టంతో ఈ సినిమాపై అంచ‌నాలు పీక్స్ కు చేరాయి. ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజ‌ర్, ఫియ‌ర్ సాంగ్ ఈ మూవీపై అంచ‌నాల‌నె రెట్టింపు చేశాయి.

ఇక ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సాంగ్ ను ఆగ‌స్టు 5న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పాట ఎలా ఉండ‌బోతుందా అని అభిమానులు ఆస‌క్తిగా చూస్తున్నారు. కాగా, ఈ పాట పూర్తి రొమాంటిక్ మెలోడీగా సాగ‌నుంద‌ని తెలుస్తోంది. తాజాగా ఈ పాట‌లోని మ్యూజిక్ క్లిప్ ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ఇది పూర్తి మెలోడీ ట్యూన్ తో ఉండ‌టంతో ఈ పాట‌పై అంచ‌నాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. ఈ పాట అనౌన్స్ మెంట్ పోస్ట‌ర్ లో ఎన్టీఆర్ స‌రికొత్త లుక్ లో క‌నిపిస్తుండ‌గా, జాన్వీ క‌పూర్ అందాల రాశిగా క‌నిపిస్తోంది. ఇక ఈ పాట‌ను రామ‌జోగ‌య్య రాయ‌గా, శిల్పా రావు ఆల‌పించారు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు