మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి మొట్ట మొదటి సోలో పాన్ ఇండియా చిత్రం “దేవర” మిక్డ్స్ టాక్ తో కూడా అనుకున్న అంచనాలు అందుకోవడం విశేషం. వరల్డ్ వైడ్ భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వారం రోజుల రన్ ని అయితే పూర్తి చేసుకుంది. అలాగే తెలుగు, హిందీ మార్కెట్ లలో మంచి వసూళ్లు సాధిస్తుంది. మరి హిందీలో ఇన్ని రోజులు సాలిడ్ వసూళ్లు అందుకున్న దేవర నిన్న గురువారం మాత్రం కొంచెం డ్రాప్ అయ్యినట్టుగా తెలుస్తుంది.
సోమవారం నుంచి బుధవారం వరకు సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం గురువారం డ్రాప్ అయ్యింది. 4,5వ రోజులు 4 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఏడవ రోజు 2.4 కోట్ల నెట్ వసూలు చేసింది. దీనితో మొదటి వారంకి 48.27 కోట్లు దేవర సాధించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ వీకెండ్ వచ్చేస్తుంది కాబట్టి వీకెండ్ లో దేవర మళ్ళీ మంచి నంబర్స్ సాధిస్తుంది అని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. మరి ఈ రెండు రోజులు ఎలాంటి నంబర్స్ ని దేవర సెట్ చేస్తుందో చూడాలి.