ఓటిటిలో తగ్గని “దేవర” హవా..!

ఓటిటిలో తగ్గని “దేవర” హవా..!

Published on Dec 11, 2024 12:01 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి తారక్ నుంచి అరవింద సమేత చిత్రం తర్వాత వచ్చిన సోలో సినిమా ఇది కాగా ఈ చిత్రంపై భారీ హైప్ సెట్ అయ్యింది. మరి వాటి నడుమే వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తో కూడా సెన్సేషనల్ వసూళ్లు అందుకుంది.

అయితే ఈ చిత్రం థియేటర్స్ లో భారీ వసూళ్లు తర్వాత దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మొదటగా దక్షిణాది భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రాగా తర్వాత హిందీలో ఆ తర్వాత కొన్ని ఇంటర్నేషనల్ భాషల్లో రిలీజ్ కి తీసుకొచ్చారు.

అక్కడ నుంచి ఓటిటిలో కూడా దేవర హవా ఓ రేంజ్ లో మొదలైంది. మరి దేవర వరుసగా నెట్ ఫ్లిక్స్ లో 5 వారాలు ట్రెండ్ అవుతూ వచ్చింది. ఇపుడు కూడా ఇండియా వైడ్ గా దేవర టాప్ 3 లో ట్రెండ్ అవుతుండడం విశేషం. ఇలా మొత్తానికి మాత్రం దేవర సెన్సేషన్ గట్టిగానే ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు