జూనియర్ ఎన్టీఆర్ దేవర: పార్ట్ 1 ట్రైలర్ కూడా విడుదల కాకముందే, ఓవర్సీస్ లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్‌తో ఇప్పటికే సంచలనం సృష్టించింది. ప్రీ-సేల్స్‌లో దేవర $800Kని అధిగమించింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే $1 మిలియన్ మార్కును చేరుకోవడం నిజంగా విశేషమే.
అటు యూ.ఎస్.ఏ లో కూడా ఇప్పటికే 25,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మొత్తానికి దేవర సినిమా థియేటర్లలోకి వచ్చే సమయానికి మరిన్ని రికార్డులను బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రేపు విడుదల కానున్న ట్రైలర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ సినిమా పై ఉత్కంఠను మరో స్థాయికి పెంచుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
కాగా ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. శ్రీకాంత్, తారక్ పొన్నప్ప, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది.