అక్కడ కూడా ‘దేవర’ దూకుడు.. మామూలుగా లేదుగా!

అక్కడ కూడా ‘దేవర’ దూకుడు.. మామూలుగా లేదుగా!

Published on Sep 18, 2024 6:02 PM IST


మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’ వచ్చే వారం వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాతో తారక్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇక ఈ సినిమా కంటెంట్‌పై చిత్ర యూనిట్ కూడా పూర్తి కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్‌కి ముందే పలు రికార్డులు క్రియేట్ చేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది.

ఈ సినిమాపై ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ క్రేజ్ నెలకొనడంతో ప్రీసేల్స్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అమెరికాతో పాటు ఆస్ట్రేలియాలోనూ ఈ సినిమా దూకుడు కనిపిస్తుంది. ఆస్ట్రేలియాలో ఈ సినిమా ఏకంగా 150K ఆస్ట్రేలియన్ డాలర్లకు పైగా కేవలం ప్రీసేల్స్ రూపంలోనే కలెక్ట్ చేసింది.

రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా అమెరికాలో ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం విశేషం. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘దేవర’ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు