Devara: ‘దేవర’పై నెట్టింట చర్చ.. ఎవరెవరి రెమ్యునరేషన్ ఎంత..?

Devara: ‘దేవర’పై నెట్టింట చర్చ.. ఎవరెవరి రెమ్యునరేషన్ ఎంత..?

Published on Sep 29, 2024 3:00 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవర’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తున్నాం. ఈ సినిమాకు ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడంతో బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేస్తున్నాడు దేవర. తొలిరోజే వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.172 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు ‘దేవర’ మేకర్స్ వెల్లడించారు.

దీంతో అసలు ఈ సినిమా బడ్జెట్ ఎంత అయ్యింది.. ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు.. అనే అంశాలపై నెట్టింట తెగ చర్చ సాగుతోంది. అయితే, ‘దేవర’ సినిమాను దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా, 26 శాతం నటీనటుల రెమ్యునరేషన్‌కే కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం రూ.60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని.. జాన్వీ కపూర్ రూ.5 కోట్లు, సైఫ్ అలీ ఖాన్ రూ.10 కోట్లు, ప్రకాష్ రాజ్ రూ.1.5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా క్యాస్టింగ్ కూడా వారి పారితోషకం పెంచి తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కాబట్టే, ఔట్‌పుట్ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చిందని.. అందుకే తొలిరోజే ఈ సినిమా రూ.172 కోట్లు వసూళ్లు రాబట్టిందని అభిమానులు అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు