“దేవర” ఈ సమయంలో జరిగే కథ..

“దేవర” ఈ సమయంలో జరిగే కథ..

Published on Sep 15, 2024 5:00 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కి వస్తుంది. దీనితో అభిమానుల్లో మరింత ఉత్కంఠ నెలకొనగా చిత్ర యూనిట్ సాలిడ్ ప్రమోషన్స్ లో ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ ప్రమోషన్స్ లో ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మరిన్ని బయటకి వచ్చాయి.

అలా ఈ సినిమా కథ ఎప్పుడు జరుగుతుంది అనేది రివీల్ అయ్యింది. ఈ చిత్రం 1980 నుంచి 1990 ల మధ్యలో జరిగే కథగా ఇప్పుడు రివీల్ అయ్యింది. దీనితో దేవర కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే రాబోతుంది అని చెప్పాలి. అలాగే మరోపక్క దేవర చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా కూడా తెరకెక్కింది అని పలు రూమర్స్ ఉన్నాయి. మరి దీనిపై రిలీజ్ అయ్యాక క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఈ సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి వస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు