Devara: ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో ‘దేవర’ ఊరమాస్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘దేవర’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో ‘దేవర’ యూనిట్ బిజీగా ఉంది.

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, దేవర రిలీజ్‌కు ముందే రికార్డులకు పాతర వేస్తున్నాడు. ఇప్పటికే ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర దేవర మ్యాస్ ర్యాంపేజ్‌తో దూసుకెళ్తున్నాడు. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్‌వైడ్ థియేట్రికల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకొచ్చాయి.

దేవర చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.180 కోట్ల థియేట్రికల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. అంటే ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.360 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తే హిట్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఏరియాల వారీగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 45 కోట్లు
వైజాగ్ – 12.5 కోట్లు
ఈస్ట్ – 8 కోట్లు
వెస్ట్ – 6 కోట్లు
కృష్ణా – 7 కోట్లు
గుంటూరు – 8.5 కోట్లు
నెల్లూరు – 4 కోట్లు
సీడెడ్ – 22 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.113 కోట్లు
కర్ణాటక – 15 కోట్లు
తమిళనాడు – 6 కోట్లు
కేరళ – 0.5 కోట్లు
హిందీ బెల్ట్ – 15 కోట్లు
ఓవర్సీస్ – 26 కోట్లు
ఇతర ఖర్చులు – 4.5 కోట్లు
వరల్డ్ వైడ్ థియేట్రికల్ – రూ.180 కోట్లు

Exit mobile version