మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన సోలో రిలీజ్ చిత్రమే “దేవర”. మరి దర్శకుడు కొరటాల శివతో తారక్ రెండో సినిమాగా చేశాడు. మరి ఈ చిత్రం ఎన్నో అంచనాలు నెలకొల్పుకుని రిలీజ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ రికార్డు వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమా హిందీలో కూడా సాలిడ్ నెంబర్ ని నమోదు చేస్తూ ఇప్పుడు 50 కోట్ల మార్క్ వైపు దూసుకెలుతుంది.
అయితే నార్త్ మార్కెట్ లో దేవర భారీ ఓపెనింగ్స్ సాధించకపోయినప్పటికీ స్టడీ పెర్ఫామెన్స్ ని అయితే అందిస్తుంది. అలా నిన్న గాంధీ జయంతి హాలిడేలో సాలిడ్ జంప్ అందుకొని అదరగొట్టినట్టు తెలుస్తుంది. మరి మొన్న మంగళవారం 4.8 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం నిన్న బుధవారం 7.15 కోట్ల వసూళ్లు అందుకోవడం విశేషం. దీనితో సాలిడ్ జంప్ ని ఈ సినిమా అందుకుందని చెప్పాలి. ఇక చూస్తూ రెండో వీకెండ్ లోకి కూడా దేవర వచ్చేస్తుంది. మరి ఈ వీకండ్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.