టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం యన్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర అనే పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నేడు కొరటాల శివ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్ తో బర్త్ డే విషెస్ తెలిపారు.
దేవర చిత్రం అనౌన్స్ మెంట్ తోనే ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ను మేకర్స్ ఏప్రిల్ 5, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవి చందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.