నెట్‌ఫ్లిక్స్‌లో ‘దేవర’.. కపిల్ శర్మ షోలో సందడి చేసిన టీమ్!

నెట్‌ఫ్లిక్స్‌లో ‘దేవర’.. కపిల్ శర్మ షోలో సందడి చేసిన టీమ్!

Published on Sep 29, 2024 1:34 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రన్ అవుతున్న మూవీ ‘దేవర’. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ సినిమాలో విధ్వంసకరమై పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన తీరు అభిమానులను అలరిస్తోంది. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ఓ రేంజ్‌లో నిర్వహించారు.

ఇందులో భాగంగా ప్రముఖ కామెడియన్ కపిల్ శర్మ షోలో కూడా ‘దేవర’ టీమ్ పాల్గొంది. అయితే, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ షో ప్రారంభం కాగా, శనివారం రోజున ‘దేవర’ టీమ్ ప్రమోషన్స్‌కి సంబంధించిన ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ షోలో ఎన్టీఆర్‌తో పాటు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్‌లు కూడా పాల్గొన్నారు.

వారు చేసిన సందడి, ‘దేవర’ సినిమా గురించి వారు పంచుకున్న విశేషాలను ఈ షో చూసి తెలుసుకోవచ్చు. ‘దేవర’ సినిమాను ఎంజాయ్ చేసిన అభిమానులు, ప్రస్తుతం ఈ షో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు