“దేవర” విషయంలో తెలుగు స్టేట్స్ డిస్ట్రిబ్యూటర్ రిక్వెస్ట్ పోస్ట్

“దేవర” విషయంలో తెలుగు స్టేట్స్ డిస్ట్రిబ్యూటర్ రిక్వెస్ట్ పోస్ట్

Published on Sep 25, 2024 12:13 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ బుకింగ్స్ ని అయితే ఇప్పుడు నమోదు చేసుకుంటుంది. అయితే ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో డైనమిక్ ప్రొడ్యూసర్ నాగ వంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాను ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహా ఇతర హీరోల అభిమానులకి కూడా ఒక పిలుపుని ఇచ్చారు. దయచేసి అందరూ ఫ్యాన్ వార్స్ ఆపాలని చాలా కాలం తర్వాత తారక్ అన్న నుంచి సినిమా వస్తుంది. అందరు కలిసి ఎంజాయ్ చేద్దామని తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చాలా కాలం తర్వాత ఓ సినిమాకి ఇంతలా సపోర్ట్ చేయడం ఆనందంగా ఉందని అలాగే సినిమాని చూసేవారు ఎవరు మొబైల్స్ లో సినిమాని చిత్రీకరించవద్దు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇందుకు సహకరించి బిగ్ స్క్రీన్స్ పై సినిమాని చూసి బ్లాక్ బస్టర్ చేద్దామని రిక్వెస్ట్ చేశారు. దీనితో తన పోస్ట్ ఇపుడు ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు