‘దావుడి’ సాంగ్‌లో దేవర మాస్ స్టెప్పులు.. గెట్ రెడీ!

‘దావుడి’ సాంగ్‌లో దేవర మాస్ స్టెప్పులు.. గెట్ రెడీ!

Published on Sep 2, 2024 7:30 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మరో అప్డేట్‌ను వదిలారు మేకర్స్. ఇప్పటికే సెన్సేషన్ అయిన రెండు సాంగ్స్‌కు తోడుగా ఇప్పుడు మూడో పాటను కూడా దేవర రెడీ చేశాడు. ‘దావుడి’ అంటూ సాగే ఈ సాంగ్ రిలీజ్‌కి దేవర టైమ్ ఫిక్స్ చేశాడు.

దావుడి వీడియో సాంగ్‌ను సెప్టెంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఎన్టీఆర్‌తో కలిసి జాన్వీ కపూర్ డ్యాన్స్ చేస్తున్న పోజ్ ఈ సాంగ్‌పై అంచనాలను పెంచేసింది. ఇక ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ మాస్ స్టెప్పులు నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని మేకర్స్ ఈ సాంగ్‌పై హైప్ క్రియేట్ చేస్తున్నారు.

మొత్తానికి దేవరోడి మాస్ స్టెప్పులు వీక్షించేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఈ సాంగ్ సినిమాకే హైలైట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే సంగీతం ఇస్తుండగా, కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. మరి దేవర మాస్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలంటే సెప్టెంబర్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు