‘దేవర’ అరుదైన ఫీట్.. బియాండ్ ఫెస్ట్‌లో స్పెషల్ షో!

 

టాలీవుడ్ దేవరోడి రికార్డుల వేట అప్పుడే మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఇండియన్ ఆడియెన్స్‌తో పాటు ఓవర్సీస్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కి ముందే యూఎస్‌లో మిలియన్ డాలర్ మార్క్‌ను టచ్ చేసి తన సత్తా చాటింది. ఇప్పుడు ‘దేవర’ మరో అరుదైన ఫీట్ సాధించింది.

లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న బియాండ్ ఫెస్ట్‌లో ‘దేవర’ స్పెషల్ షో వేయనున్నారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు జరిగే ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఇండియా నుంచి ఎంపికైన ఒకే ఒక్క చిత్రం ‘దేవర’. ఈ సినిమాను సెప్టెంబర్ 26న బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శించనున్నారు. ఇక ఈ ఫెస్ట్‌కు ‘దేవర’ యూనిట్ హాజరుకానున్నట్లు సమాచారం.

‘దేవర’ సినిమాను బియాండ్ ఫెస్ట్‌లో పలువురు హాలీవుడ్ స్టార్స్ కూడా వీక్షించనున్నారు. దేవర సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ ట్రాక్ అందించాడు.

Exit mobile version