Devara: రేపటి నుండి ‘దేవర’ జోరు మరింత పెరగనుంది!

Devara: రేపటి నుండి ‘దేవర’ జోరు మరింత పెరగనుంది!

Published on Oct 1, 2024 11:22 PM IST

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తున్నాం. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేయగా పూర్తి మాస్ యాక్షన్ డ్రామాగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు రిలీజ్ రోజున మిక్సిడ్ టాక్ వచ్చినా, టాక్‌తో సంబంధం లేకుండా థియేటర్ల వద్ద ‘దేవర’ ర్యాంపేజ్ కనిపిస్తోంది. ఫలితంగా తొలి వీకెండ్ ముగిసే సరికి చాలా ప్రాంతాల్లో ఈ మూవీ 70-80 శాతం రికవరీ చేసినట్లుగా మేకర్స్ తెలిపారు.

ఇక మండే టెస్టు‌లో ఈ సినిమా వసూళ్లు కాస్త డ్రాప్ అయినా, రేపటి నుండి అంటే.. అక్టోబర్ 2 నుంచి దేవర మళ్లీ పుంజుకోనుందనే చెప్పాలి. అక్టోబర్ 2 సెలవు కావడంతో పాటు దసరా సెలవులు కూడా రావడంతో, ఇప్పుడు అందరూ థియేటర్లలో ‘దేవర’ను చూసేందుకు ఆసక్తిని చూపుతారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

బాక్సాఫీస్ దగ్గర మరో వారం రోజులపాటు ఎలాంటి పెద్ద సినిమాలు రిలీజ్‌కి లేకపోవడంతో ఇది ‘దేవర’కు మంచి అవకాశం అని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకు మేజర్ ఆకర్షణగా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు