దేవర ట్రైలర్.. ఇక్కడే చూడాల్సింది!

దేవర ట్రైలర్.. ఇక్కడే చూడాల్సింది!

Published on Sep 9, 2024 10:48 PM IST

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘దేవర’ ఊరమాస్ ట్రైలర్ రిలీజ్‌కి డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌ని సెప్టెంబర్ 10న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ ట్రైలర్ ఎలాంటి ర్యాంపేజ్ సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ ట్రైలర్‌ను ఎక్కడ చూడొచ్చు అనే విషయంపై మేకర్స్ తాజాగా మరో క్లారిటీ ఇచ్చారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ 5 భాషల్లో రిలీజ్ కానుంది. తెలుగులో ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, హిందీలో టీ-సిరీజ్, తమిళ్‌లో టీ-సిరీస్ తమిళ్, కన్నడలో జూ.ఎన్టీఆర్ అఫీషియల్, మలయాళంలో యువసుధ ఆర్ట్స్ ఛానల్స్‌లో ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.

జూ.ఎన్టీఆర్ తన విశ్వరూపాన్ని చూపెడతాడని.. కోస్తా ప్రాంతానికి సంబంధించిన మాస్ థండర్ ఈ ట్రైలర్‌లో ఉంటుందని మేకర్స్ ఈ ట్రైలర్‌పై హైప్ మరింత క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేయగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఇక సెప్టెంబర్ 27 నుంచి దేవర ఊచకోత మొదలవుతుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు