భారీ బుకింగ్స్ తో “దేవర”


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ కి కూడా వచ్చింది. అయితే ఈ చిత్రంకి యూఎస్ మార్కెట్ లో భారీ బుకింగ్స్ నమోదు అయ్యిన సంగతి తెలిసిందే.

అక్కడ ఎప్పుడో 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని సినిమా దాటేయగా టికెట్స్ కూడా భారీ సంఖ్యలో తెగుతున్నాయి. అలా ఇప్పుడు దేవర ఏకంగా 30 వేలకి పైగా టికెట్స్ ని బుక్ చేసుకొని భారీ రికార్డు సెట్ చేసింది. దీనితో యూఎస్ మార్కెట్ లో దేవర హవా ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించగా ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version