మిస్టర్ బచ్చన్: పంచ్ డైలాగ్ లేకుండా పంచ్ క్రియేట్ చేసారు – దేవి శ్రీ ప్రసాద్

మిస్టర్ బచ్చన్: పంచ్ డైలాగ్ లేకుండా పంచ్ క్రియేట్ చేసారు – దేవి శ్రీ ప్రసాద్

Published on Jun 17, 2024 11:01 PM IST

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో, మాస్ మహారాజ రవితేజ (Raviteja) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ (Mr Bachchan). భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంకి సంబందించిన షో రీల్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేయడం జరిగింది. ఈ మాస్ గ్లింప్స్ ప్రేక్షకులని, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. డైలాగ్ లేకుండా, పవర్ ఫుల్ గా షో రీల్ ను రిలీజ్ చేయడం పట్ల హరీష్ శంకర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఆడియెన్స్.

సినీ ప్రముఖుల నుండి కూడా అభినందనలు వస్తున్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ గ్లింప్స్ ను చూసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వావ్ హరీష్ శంకర్ సార్, పంచ్ డైలాగ్ లేకుండానే పంచ్ క్రియేట్ చేసారు. మాస్ మహారాజ అద్బుతం గా ఉన్నారు. షో రీల్ సూపర్ గా ఉంది. బ్లాక్ బస్టర్ లోడ్ అవుతోంది. థియేటర్ల లో చూడటానికి వేచి ఉండలేను. మిస్టర్ బచ్చన్ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ కి థాంక్స్ తెలిపిన హరీష్ శంకర్, మీ కామెంట్ లోనే పంచ్ ఉంది అని అన్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు