Pushpa 2: ‘పుష్ప-2’ ఫస్ట్ రివ్యూ.. నెక్స్ట్ లెవెల్ మూవీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ కోసం వరల్డ్‌వైడ్‌గా అభిమానులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి. అయితే, ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ క్రమంలో ‘పుష్ప-2’ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఆయన తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడాడు. ‘పుష్ప-2’ చిత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని ఆయన తెలిపాడు. ‘పుష్ప-2’ ఫస్ట్ హాఫ్ చూసిన తనకు మైండ్ బ్లాక్ అయ్యిందని.. ఈ చిత్రానికి సుకుమార్ స్క్రిప్టు రాసిన విధానం.. ఆయన దాన్ని తెరకెక్కించిన తీరు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన తెలిపాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మ్యాజిక్‌తో ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాడు.

ఇలా ‘పుష్ప-2’ ఫస్ట్ హాఫ్‌కే దేవిశ్రీ ప్రసాద్ నెక్స్ట్ లెవెల్ మూవీ అంటూ రివ్యూ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలవక ముందే, ఇలా సినిమాపై హైప్ తీసుకొస్తుండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఈ ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. డిసెంబర్ 6న ‘పుష్ప-2’ వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Exit mobile version