నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా స్వయంగా తెరకెక్కిస్తూ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న పాన్ ఇండియన్ మూవీ డెవిల్. దీనికి ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉప శీర్షిక. ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే డెవిల్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్, రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ ఫై మంచి అంచనాలు ఏర్పరిచాయి.
విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ నుండి దూరమే తీరమై అనే పల్లవితో సాగె ఎమోషనల్ లవ్ సాంగ్ యొక్క ప్రోమో ని రిలీజ్ చేసారు మేకర్స్. సమీరా భరద్వాజ్ స్వయంగా రచించి ఆలపించిన ఈ సాంగ్ ప్రోమో ప్రస్తుతం అందరినీ అలరిస్తుండగా ఫుల్ సాంగ్ ని డిసెంబర్ 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రోమోలో తెలిపారు. ఇక ఈ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీని డిసెంబర్ 29న పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.