నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ తో నిర్మితం అవుతున్న ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే డెవిల్ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.
మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని డిసెంబర్ 12న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన మేకర్స్, దానిని రేపు సాయంత్రం సరిగ్గా 5 గం. 29. ని. లకు రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. కాగా ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన డెవిల్ తప్పకుండా డిసెంబర్ 29న విడుదల అనంతరం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.