మాస్ మహారాజ్ “ధమాకా” నుంచి మాస్ ట్రీట్ కి టైం ఫిక్స్.!

Published on Sep 21, 2022 11:59 am IST

మన టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరోస్ లో మాస్ మహారాజ రవితేజ కి స్పెషల్ ప్లేస్ ఉంటుంది అని చెప్పాలి. మాస్ మహారాజ హీరోగా తన ఏజ్ తో సంబంధం లేకుండా జెట్ స్పీడ్ లో సినిమాలతో దూసుకెళ్తున్నారు. అలా లేటెస్ట్ గా చేస్తున్న సినిమాల్లో దర్శకుడు త్రినాథ రావు నక్కిన తో ప్లాన్ చేసిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “ధమాకా” కూడా ఒకటి. మరి యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటించిన ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ సింగిల్ బాగానే ఆకట్టుకోగా..

ఇపుడు మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చేందుకు గాను రంగం సిద్ధం చేసినట్టు తెలిపారు. మరి ఈ సినిమా టైటిల్ ట్రాక్ గా ధమాకా మాస్ దావత్ ని ఈ సెప్టెంబర్ 23న సాయంత్రం 5 గంటల 1 నిమిషానికి రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పుడు అనౌన్స్ చేశారు. మరి దీనిపై రిలీజ్ చేసిన పోస్టర్ కూడా మంచి మాస్ అండ్ పవర్ ఫుల్ గా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అయితే భీమ్స్ సంగీతం అందిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :