సెన్సార్ పూర్తి చేసుకున్న ధనుష్ ‘తిరుచిత్రంబలం’ మూవీ …!

Published on Aug 11, 2022 11:04 pm IST

ధనుష్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కిన లేటెస్ట్ మూవీ తిరుచిత్రంబలం. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీని మిత్రన్ జవహర్ తెరకెక్కించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీలో నిత్యా మీనన్ ఒక కీలక పాత్ర చేస్తుండగా రాశి ఖన్నా, ప్రియా భవానిశంకర్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయి ఆడియన్స్ లో మరింతగా అంచనాలు ఏర్పరచడం జరిగింది.

ఆగష్టు 18న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తి అయ్యాయి. కాగా సెన్సార్ వారు ఈ మూవీకి యు/ఏ సర్టిఫికెట్ అందించారు. భారతి రాజా, ప్రకాష్ రాజ్, మునీష్ కాంత్ తదితరులు ఈ మూవీలో ఇతర పాత్రలు చేసారు. కాగా ధనుష్ ఫ్యాన్స్ లో కూడా బాగా అంచనాలు ఏర్పరిచిన తిరుచిత్రంబలం మూవీ విడుదల తరువాత ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :