టాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరో ఎవరో వెల్లడించిన ధనుష్!

టాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరో ఎవరో వెల్లడించిన ధనుష్!

Published on Jul 21, 2024 10:29 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ రాయన్. జూలై 26, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అయిపోయిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. మేకర్స్ ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో ధనుష్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అయితే టాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరో ఎవరు అని యాంకర్ అడగగా, ఐ లవ్ సినిమా, ఐ లవ్ పవన్ కళ్యాణ్ సర్ అంటూ చెప్పుకొచ్చారు.

ధనుష్ చేసిన వ్యాఖ్యలకు ఆడిటోరియం దద్దరిల్లింది. ఈ చిత్రంలో ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్, సందీప్ కిషన్, కాళిదాస్, జయరామ్, దుషరా విజయన్, అపర్ణ బాలమురళీ, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ధనుష్ కెరీర్ లో 50 వ చిత్రంగా తెరకెక్కిన రాయన్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు