తమిళ హీరో ధనుష్ దర్శకుడిగా కూడా తన సత్తా చాటుకున్నాడు. ఇప్పటికే ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. రీసెంట్‌గా ధనుష్ డైరెక్షన్‌లో తెరకెక్కిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం NEEK తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా?’ అనే టైటిల్‌తో రిలీజ్ అయ్యింది.
ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా మార్చి 21 నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
దీంతో ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ ఆశిస్తుంది. ఇక ఈ సినిమాలో పవిష్ నారాయణ్, మాథ్యూ థామస్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, శరత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read – ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న “డ్రాగన్”