కోలీవుడ్ గ్లోబల్ హీరో ధనుష్ హీరోగా ఇపుడు తెలుగు సహా తమిళ్ లో కూడా పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ములతో “కుబేర” సినిమాలో తాను బిజీగా ఉండగా ఈ సినిమా చేస్తున్న సమయంలోనే కోలీవుడ్ స్టార్ నటి నయనతారకి ఒక ఊహించని షాక్ ని తాను అందించాడు.
ఆమె పెళ్లి డాక్యుమెంటరీలో తన సినిమా “నానుమ్ రౌడీ దాన్” అనే సినిమాలో విజువల్ ఒక మూడు సెకండ్స్ క్లిప్ ఉండడంపై 10 కోట్లు తనకి కట్టాలని కేసు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై నయన్ కూడా పెద్ద ప్రెస్ నోట్ ని కూడా విడుదల చేసింది. అయితే ఈ తర్వాత ధనుష్ సైలెంట్ గానే ఉన్నాడు అని చాలా మంది అనుకున్నారు కానీ ఇపుడు తాను కోర్ట్ వరకు వెళ్లినట్టుగా తెలుస్తుంది.
తన నిర్మాణ సంస్థ వుండర్బేర్ ఫిల్మ్స్ వారు మద్రాస్ హై కోర్ట్ ని ఆశ్రయించారట. దీనితో ఇది ఊహించని ట్విస్ట్ గా మారింది అని చెప్పాలి. దీనితో నయన్ విషయంలో మాత్రం ధనుష్ వెనక్కి తగ్గేలా లేడనే చెప్పాలి. మరి నయన్ 10 కోట్లు ఇస్తుందా లేక మరో రకంగా పోరాడుతోందా అనేది ఇపుడు మరింత ఆసక్తిగా మారింది.