ధనుష్ “కర్ణన్” మూవీకి అరుదైన గౌరవం..!

Published on Sep 15, 2021 1:37 am IST


కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ హీరోగా నటించిన “కర్ణన్” చిత్రానికి అరుదైన గౌరవం లభించింది.వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ధాను నిర్మించిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. 2021 ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ సైతం భారీగానే దక్కించుకుంది.

అయితే తాజాగా ఈ సినిమా ‘న్యూ జనరేషన్స్-ఇండిపెండెంట్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. నవంబర్ 12,13,14 తేదీలలో ఈ చిత్రోత్సవం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరగనుంది. ప్రస్తుతం ‘కర్ణన్’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా త్వరలోనే తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రీమేక్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :