సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ధనుష్ ‘నేనే వస్తున్నా’

Published on Sep 22, 2022 5:20 pm IST

కలైపులి ఎస్ థాను నిర్మాతగా వి క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ నేనే వస్తున్నా. వెర్సటైల్ యాక్టర్ ధనుష్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సెల్వ రాఘవన్ తెరకెక్కించాగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. తెలుగులో ఈ మూవీని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 29న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది ఈ మూవీ.

కాగా నేడు కొద్దిసేపటి క్రితం ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవడంతో మూవీకి యు/ఏ సర్టిఫికెట్ ని కేటాయించింది సెన్సార్ బోర్డు. చాలా గ్యాప్ తరువాత ధనుష్, సెల్వరాఘవన్ కలిసి చేస్తున్న మూవీ కావడంతో నేనే వస్తున్నా పై ఆడియన్స్ లో విపరీతంగా అంచనాలు ఉన్నాయి. ఓంప్రకాష్ ఫోటోగ్రఫి అందించిన ఈ మూవీలో ఇందూజ, ఇల్లి అవ్రమ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :