ధనుష్ ‘నేనే వస్తున్నా’ రిలీజ్ డేట్ ఫిక్స్ …!

Published on Sep 21, 2022 11:28 pm IST

కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ధనుష్ హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ నేనే వస్తున్నా. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించిన ఈ మూవీలో ధనుష్ డ్యూయల్ రోల్ చేస్తుండగా ఈ మూవీని సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు దర్శకుడు సెల్వ రాఘవన్. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఒక సాంగ్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ అందరిలో మూవీ పై మంచి ఆసక్తిని రేకెత్తించాయి.

ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 29 న వరల్డ్ వైడ్ గ్రాండ్ లెవెల్లో విడుదల చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తిరు మూవీతో మంచి సక్సెస్ అందుకుని జోరు మీదున్న ధనుష్, ఈ మూవీతో కూడా మరొక సక్సెస్ అందుకోవడం ఖాయం అంటోంది నేనే వస్తున్నా యూనిట్.

సంబంధిత సమాచారం :