Dhanush : ‘ఇడ్లీ కడై’ మూవీతో వస్తున్న ధనుష్

తమిళ వెర్సటైల్ యాక్టర్ ధనుష్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన రీసెంట్ మూవీ ‘రాయన్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే మల్టీస్టారర్ మూవీలో ధనుష్ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా, ధనుష్ తన కెరీర్‌లోని 52వ చిత్రాన్ని తాజాగా అనౌన్స్ చేశాడు.

‘ఇడ్లీ కడై’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను ధనుష్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

వైవిధ్యమైన కథలను తెరకెక్కిస్తున్న ధనుష్, ఈసారి ఎలాంటి కథను పట్టుకొస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలోని మిగతా నటీనటుల గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version