‘కర్ణన్’ కాంబో రిపీట్.. ఈసారి ఎలాంటి కథతో వస్తారో?

‘కర్ణన్’ కాంబో రిపీట్.. ఈసారి ఎలాంటి కథతో వస్తారో?

Published on Apr 10, 2025 1:00 AM IST

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ‘కుబేర’, ‘ఇడ్లీ కడాయ్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత తన నెక్స్ట్ మూవీని ఎవరితో చేయబోతున్నాడనే విషయాన్ని ఆయన రివీల్ చేశారు. తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ మారి సెల్వరాజ్‌తో గతంలో ‘కర్ణన్’ అనే బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని రూపొందించాడు ధనుష్.

ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ధనుష్ కెరీర్‌లో 56వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ను ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ‘త్వరలోనే ఓ గొప్ప యుద్ధం ప్రారంభం కానుంది’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా ఎలాంటి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కె గణేష్ ప్రొడ్యూస్ చేయనున్నారు. మరి ధనుష్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తాడా.. మారి సెల్వరాజ్ ఈసారి ఎలాంటి కథను పట్టుకొస్తున్నాడా అనేది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు