వరల్డ్ వైడ్ “రాయన్” మొదటి రోజు వసూళ్లు..

వరల్డ్ వైడ్ “రాయన్” మొదటి రోజు వసూళ్లు..

Published on Jul 27, 2024 4:00 PM IST

కోలీవుడ్ టాలెంటెడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా అలాగే తన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ చిత్రం “రాయన్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ధనుష్ కెరీర్ లో 50వ సినిమాగా తెరకెక్కించగా దీనిపై తమిళ ఆడియెన్స్ లో సాలిడ్ బజ్ నెలకొంది. దీనితో ధనుష్ కెరీర్ లో ఈ చిత్రం ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంటుంది అని తన ఫ్యాన్స్ ఆశించారు. అయితే అనుకున్నట్టుగనే ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాలిడ్ వసూళ్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ చిత్రం డే 1 కి గాను 20 కోట్ల మేర గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా అందుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే తెలుగులో బిలో యావరేజ్ గానే పెర్ఫామ్ చేస్తున్న ఈ చిత్రానికి తమిళ్ లో మాత్రం మంచి ఆదరణ అందుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ వీకెండ్ లో ఎలాంటి వసూళ్లు ఈ చిత్రానికి నమోదు అవుతాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా సందీప్ కిషన్, కాళిదాస్ జైరాం, ఎస్ జే సూర్య తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు